మేమింతే.. జోరు వాన‌లో.. చెట్ల‌కు నీరు పెడుత‌న్న జీహెచ్ఎంసీ సిబ్బంది

గ‌త వారం రోజులుగా జోరుగా వ‌ర్షం ప‌డుతుంది.. అవ‌స‌ర‌మైతేగానీ బ‌య‌టికి రావ‌ద్దంటూ ఆదేశాలు జారీ చేశారు అధికారులు. కులాసాగా కూర్చొని, వేడి వేడి మిర్చీలు తింటూ భార్యా పిల్ల‌ల‌తో గ‌డుపడం త‌ప్ప పెద్ద‌గా బ‌య‌టికి వెళ్ళే ప‌రిస్థితి లేదు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వ‌ర్క్‌ఫ్ర‌మ్ హోమ్ అంటూ త‌మ ప‌ని తాము చేసుకుంటున్నారు. మ‌రో రెండు మూడు రోజులు వ‌ర్షాలు తగ్గేలా లేవు.

ఎండా కాలంలో గొంగ‌ళి క‌ప్పుకునే ర‌కాలు ఉంటారుగా.. అలాగే మొన్నామ‌ద్య జోరు వ‌ర్షంలో రోడ్డు వేసిన ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. అలా రోడ్డు వేస్తుంటే ఇలా వ‌ర్షం వ‌ర‌ద‌లో కొట్టుకుపోవ‌డం చూశాం. స‌ద‌రు కాంట్ర‌క్ట‌ర్‌కు ఊస్టింగ్ ఆర్డ‌ర్స్ ఇచ్చేశారు, సోష‌ల్ మీడియాలో చెడా మ‌డా తిట్టేశారు. ప్ర‌జ‌ల సొమ్మును నీటిపాలు చేస్తున్నారంటూ విరుచుకుప‌డ్డారు.

ప‌ని అంటే ప‌నే వ‌ర్ష‌లు ప‌డినా, భూమి బ‌ద్ద‌లైనా త‌మ ప‌ని తాము చేసుకుంటూ వెళ్ళిపోతామంటూ జీహెచ్ఎంసీ సిబ్బంది వాట‌ర్ ట్యాంక‌ర్ల‌తో చెట్ల‌కు నీళ్ళు ప‌డుతున్నారు. ఏం బాబులు కొంచెం వాడండ‌య్యా.. మీ సిన్సియారిటీ త‌గ‌లెయ్య‌.. కుండ‌పోత‌గా వ‌ర్షం ప‌డుతుంటే మ‌ళ్ళీ నీళ్ళు పెట్ట‌డం ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఏదో చెయ్యాలి త‌ప్ప ఎందుకు చేస్తున్నాం?? ఏం చేస్తున్నాం?? అనేది కూడా తెలియ‌కుండా ఎద్దు వ‌చ్చి చేలో ప‌డిన‌ట్లు,, గుడ్డిగా వాట‌ర్ ప‌ట్ట‌డం ఏంటంటూ ప్ర‌శ్నిస్తున్నారు నెట్టింజ‌న్స్‌. అయితే ఈ వీడియో ఇప్ప‌టిదేనా లేక పాత వీడియోనా తేలియ‌దు. పాపం వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, చెయ్య‌క‌పోతే పై అధికారుల మాట‌లు ప‌డాల్సిందే అందుకే చేస్తున్నారంటూ కొంద‌రు స‌పోర్ట్ చేస్తున్నారు.

స‌ద‌రు వీడియోను ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఉమా సుధీర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వ‌ర్షాలు ప‌డినా, ఎండ‌లు కొట్టినా జీహెచ్ఎంసీ సిబ్బంది ఎంత సిన్సియర్ గా వాళ్లకు అప్పజెప్పిన డ్యూటీని చేస్తున్నారు, మేమింతే అంటూ ఆ వీడియోను ట్వీట్ చేసింది. ఇప్ప‌డు ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.