తెలంగాణ రైతులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త చెప్పారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి పండుగ తరువాత రాష్ట్ర రైతులకు ఆయన రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు. డిసెంబర్ 05న యాప్ ను ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో చేపడుతామని పేర్కొన్నారు.
ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని వెల్లడించారు. పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపడుతూ.. నిరుద్యోగుల కళ్లలో ఆనందం చూస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే 50వేల మందికి నియామక ప్రతాలు అందించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆరోగ్య శాఖ పై ప్రత్యేక దృష్టి సారించి ముందకు సాగుతున్నామని తెలిపారు. కావాలనే గురుకులాలపై కుట్ర పూరితంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు పదేళ్లు అవకాశం ఇస్తే.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని బీఆర్ఎస్ పై మండిపడ్డారు.