రాష్ట్ర ప్ర‌జ‌లు ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకున్నా : గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై

-

మేడారం మ‌హా జాత‌రను తెలంగాణ రాష్ట్ర గ‌వర్న‌ర్ త‌మిళ సై సౌంద‌ర ర‌జ‌న్ సంద‌ర్శించారు. గ‌ద్దెల వ‌ద్ద‌ సమ్మ‌క్క – సార‌ల‌మ్మను ద‌ర్శించుకున్నారు. అంతే కాకుండా అమ్మ వార్ల‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. కాగ మేడారానికి గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై రోడ్డు మార్గంలోనే వ‌చ్చారు. మేడారం లో ములుగు ఎమ్మెల్యే సీత‌క్క ఘ‌న స్వాగ‌తం పలికారు. కాగ గిరిజ‌నుల జీవ‌నాన్ని చూడ‌టానికే తాను రోడ్డు మార్గంలో మేడారానికి వ‌చ్చిన‌ట్టు గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై తెలిపారు. ఆదివాసీలు పోషకాహార లోపంతో బాధ‌ప‌డుతున్నార‌ని అన్నారు.

ఆదివాసీలు ఎదుర్కొంటున్న ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డానికి త‌న వంతుగా ప్ర‌య‌త్నం చేస్తున్నాట్టు తెలిపారు. ఇప్ప‌టికే పోషకాహార స‌మ‌స్య‌ను ఎదుర్కొవ‌డానికి చిక్కీలు, మ‌హ‌మూబా ల‌డ్డూలు కూడా పంపిణీ చేశామ‌ని తెలిపారు. కాగ స‌మ్మ‌క్క – సార‌ల‌మ్మ‌ల‌ను తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌లు అంద‌రూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాల‌ని తాను కోరుకున్నాన‌ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై సౌంద‌ర రాజ‌న్ తెలిపారు. వ‌న దేవ‌త‌లు ను ద‌ర్శించుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని అన్నారు. అలాగే జాత‌ర నుంచి ప్ర‌జ‌లు అంద‌రూ కూడా క్షేమంగా ఇంటికి వెళ్లాల‌ని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version