ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి హరిత రిసార్టులు, హోటళ్లు ?

-

ప్రైవేట్ వ్యక్తులు, రాజకీయ నాయకుల చేతుల్లోకి హరిత రిసార్టులు, హోటళ్లు వెళుతున్నట్లు సమాచారం అందుతోంది. కోట్లాది రూపాయల లాభాల్లో ఉన్నా సరే తప్పుకుంటోదట తెలంగాణ పర్యాటక సంస్థ. ప్రభుత్వానికి కోట్లల్లో ఆదాయం తెచ్చే, వివిధ ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యంగా ఉండే పర్యాటక రిసార్టులు, హోటళ్లు ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల, రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్తున్నాయి.

Green resorts and hotels in the hands of private individuals

నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు సమీపంలో ఉన్న హరిత రిసార్ట్, హోటల్ తో ప్రభుత్వానికి సంవత్సరానికి కోటి రూపాయల ఆదాయం రాగా, గత నెలలో ఈ రిసార్ట్ ను ప్రభుత్వం, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించింది. ఇదే బాటలో నెలకి కోటిన్నర ఆదాయం ఇచ్చే గోల్కొండలోని తారామతి – బారాదరిని అలాగే ఏడాదికి మూడున్నర కోట్లకు పైగా ఆదాయం వచ్చే వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ సమీపంలోని హరిత రిసార్టులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని ప్రభుత్వం చూస్తుంది. ఏటా రెండున్నర కోట్లు ఇచ్చే నిజామాబాద్ జిల్లాలోని రిసార్ట్ ను కొందరు రాజకీయ నాయకులు పొందడానికి ప్రయత్నిస్తుండగా.. బేగంపేటలోని టూరిజం ప్లాజాను సైతం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version