ఉద్యోగాలు ఇచ్చేది BRS అయితే, తీసేసేది BJP – హరీష్ రావు

-

ఉద్యోగాలు ఇచ్చేది బీఆర్‌ఎస్‌ అయితే, ఉద్యోగాలు ఊడపీకేది బీజేపీ అని మంత్రి హరీష్‌ రావు విమర్శలు చేశారు. జహీరాబాద్‌లో రూ.97 కోట్లతో నిర్మిస్తున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, పనుల పైలాన్ ని ఆవిష్కరించిన మంత్రి హరీశ్ రావు. అనంతరం నూతనంగా నిర్మించబోతున్న హజ్ హౌస్‌కు శంకుస్థాపన చేశారు.

ఇదే క్రమంలో జహీరాబాద్‌ పట్టణంలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ & నాన్ వెజ్ మార్కెట్‌ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు, చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ , జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం హరీష్‌ రావు మాట్లాడుతూ, హైద్రాబద్ లోని గేటెడ్ కమ్యూనిటీ లాగా ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇలాంటి ఇండ్లు చూసారా అంటూ ప్రశ్నించారు.అప్పట్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రావాలంటే లంచాలు ఇచ్చేవారు.ఇప్పుడు ఆ పరిస్థితి లేదని స్పష్టం చేసారు మంత్రి హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Latest news