చంద్రబాబు మనుషులతో తెలంగాణ లెక్కలు రాయించారు…ఏపీకి చెందిన రిటైర్డు అధికారితో రాయించారని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కంటే 22 రాష్ట్రాలు అప్పు ఎక్కువ తీసుకున్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ అప్పులపై హరీష్ రావు మాట్లాడుతూ…తెలంగాణ కంటే 22 రాష్ట్రాల్లో అప్పు ఎక్కువ తీసుకున్నాయి…రాజస్థాన్.. 5.37 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు.
కర్ణాటక కూడా 5 లక్షల కోట్లు అప్పు చేసిందని మండిపడ్డారు. BRS హయాంలో ఆస్తుల కల్పన చేశామని..ప్రజలను తప్పుదారి పట్టించేలా శ్వేత పత్రం ఉందని వివరించారు. BRS హయాంలో వైద్య ఆరోగ్య రంగంలో అధ్భుత ప్రగతి సాధించామన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ వాళ్లకు కన్వినెంట్ గా తయారు చేసుకున్నారు…. అప్పులు కొలిచే విధానం ఫాలో కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేశారని మండిపడ్డారు. శ్వేతపత్రంలో వివరాలు తప్పుల తడకగా ఉన్నాయి.. గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం జరుగుతోంది.. శ్వేతపత్రంలో చూపించిన లెక్కలు తప్పు అన్నారు హరీష్ రావు.