పార్టీ జెండాలను కింద పడేస్తాం..కానీ జాతీయ జెండాను పడేయద్దన్నారు మంత్రి హరీష్ రావు. స్వాతంత్ర్య ఫలాలు అందరికి దక్కాలంటే కులాలకు, మతాలకు అతీతంగా పని చేయాలని…ఈ మధ్య కొన్ని విచిన్నకర శక్తులు కులాల మధ్య, మతాల మధ్య విడదీసి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నాయని తెలిపారు.
విచిన్నకర శక్తులతో జాగ్రత్తగా ఉండాలి…కొంత మంది ఇలా చిచ్చుపెట్టి ఓట్ల రాజకీయం చేసి లాభం పొందాలని చూస్తున్నారాన్నారు. మనకు కులాలతో మతాలతో మతం పని లేదు…కులం, మతంతో పని లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు trs ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఇంటింటికి మంచి నీరు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని…రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ర్టం తెలంగాణ అని వెల్లడించారు. అందరూ గాంధీ సినిమా చూడాలి…జెండాను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి, ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కోరారు.