డబుల్ ఇంజన్ సర్కారు యూపీ పరిస్థితి ఏంటి ? అని ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. మీ డబుల్ ఇంజన్ పాలన అంటే తిరోగమన పాలన అంటూ ఎద్దేవా చేశారు హరీష్. యూపీతో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం మూడు రెట్లు ఎక్కువగా ఉందని గుర్తు చేశారు.
అమిత్ షా తెలంగాణ రాష్ట్ర సర్కార్ స్కీమ్ లబ్ధిదారులను అడిగితే నిధులు అందినయా… లేదా.. తెలుస్తుందని చెప్పారు. ముందు అమిత్ షా తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిజెపి నిన్న సభ పెట్టి 24 పైసలు తెలంగాణ కు ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమైక్యాంధ్రలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది… విభజన హామీలు అమలు చేయలేదని.. తెలంగాణకు కొత్త జాతీయ రహదారులు, రీజినల్ రింగ్ రోడ్డు ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఇచ్చినవి తెలంగాణ ప్రజల హక్కు అని స్పష్టం చేశారు. పార్లమెంటులో అడిగిన ప్రశ్నలకు ఒక్కటీ కూడా సమాధానం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు.