కూకట్ పల్లి లో వంద రూపాయల నోట్ల కట్టలు మొత్తం రూ.50 వేలు గాల్లోకి విసిరేశాడు యూట్యూబర్ హర్ష పవన్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. మీడియా సీరియస్ అయింది. యూట్యూబర్ హర్ష పవన్ ను హెచ్చరిస్తూ.. కొన్ని ఛానెల్స్ హెచ్చరించాయి. అయితే.. దీనిపై యూట్యూబర్ హర్ష పవన్ స్పందించాడు. నన్ను బ్యాడ్ చేయొద్దు నేను మంచోడిని. యూట్యూబ్ లో మరో వీడియో పోస్ట్ చేసాడు.
తాను లక్షల మందికి హెల్ప్ చేశాను అంటున్న యూట్యూబ్..తాను చేసిన సహాయాన్ని ఎవరు పట్టించుకోకుండా నన్ను బ్యాడ్ చేస్తున్నారంటూ ఆగ్రహించాడు. మీడియా ఛానల్స్ నన్ను బ్యాడ్ చేస్తుందంటూ ఆగ్రహించాడు. యూట్యూబర్ చేసిన రచ్చ పై ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్ లో కేసులు నమోదు అయ్యాయి. రోడ్డుపై డబ్బులు వెదజల్లి హంగాము చేసిన యూట్యూబర్ పై చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. యూట్యూబర్ హర్షపై రెండు పోలీస్ స్టేషన్ లలో కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు..KPHB పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదు చేశారు.