హైడ్రా కూల్చివేతలు.. సీఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు

-

గ్రేటర్ హైదరాబాద్ మహానగర పరిధిలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్డడాలను హైడ్రా ఆధ్వర్యంలో అధికారులు కూల్చివేయిస్తున్న విషయం తెలిసిందే. యుద్ధ ప్రాతిపదికన అక్రమ కట్టడాల కూల్చివేతలు శరవేగంగా కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే పలువురు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. అన్ని నిబంధలను పక్కాగా అమలు చేసినా హైడ్రా అధికారులు కట్టడాలను కూలుస్తున్నారంటూ కొందరు పిటిషన్లు దాఖలు చేశారు.దీంతో రూల్స్ మేరకే నడుచుకోవాలని హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది.

ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు సీఎస్ శాంతికుమారి గురువారం కీలక సమావేశం నిర్వహించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ నీటి పారుదల శాఖ అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి కలెక్టర్లతో భేటీ అయ్యారు. హైడ్రా తన పని తను చేసుకుంటూ వెళ్తున్న తరుణంలో ఎటువంటి న్యాయపరమైన సమస్యలు రాకుండా చూడాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version