ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభం

-

IIHT విద్యార్థులకు నెలకు రూ.2500 ప్రోత్సాహకం అందించారు సీఎం రేవంత్ రెడ్డి . హైదరాబాద్‌లోని లలిత కళాతోరణంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(IIHT) ప్రారంభోత్సవం చేశారు.

చేనేత అభయమస్తం లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. నేతన్న కు చేయూత పథకం కింద రూ.290 కోట్లు నిధులు విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. యువ చేనేత కళాకారులు సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటాన్ని అందజేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వేలాది మందిని కలుసుకునే కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మంత్రి తుమ్మల, ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్య లను అభినందిస్తున్నట్టు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version