ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేస్తామని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ పేర్కొన్నరు. మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడుదామని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
పాస్టర్ ఆఫ్ ప్యారీస్, కెమికల్స్ తో తయారుచేసిన విగ్రహాల వల్ల జలాశయాలు, చెరువులు కాలుష్యం అవుతాయని తెలిపారు. ఈ మేరకు పిసిబితో కలిసి వాల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇది ఇలా ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో మద్యం విధానానికి సంబంధించి దరఖాస్తుల నమోదులో సరికొత్త రికార్డు నమోదయింది.
నిన్నటితో దరఖాస్తు గడువు ముగియగా…. లైసెన్సుల కోసం తొలిసారి 1.25 లక్షలకు పైగా అప్లికేషన్లు అందాయని అబ్కారి శాఖ పేర్కొంది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ. 2,500 కోట్లకు పైగా ఆదాయం చేకూరింది. చివరి రెండు రోజుల్లోనే 55 వేలకు పైగా దరఖాస్తులు రావడం గమనార్హం. గత టెండర్ల సమయంలో మొత్తం 79 వేల దరఖాస్తులు వచ్చాయి.