సూసైడ్ నోట్ రాసి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

-

కార్పొరేట్ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందుకు కారణాల గురించి మాత్రం అంతు చిక్కడం లేదు. కళాశాల యాజమాన్యం వేధింపులా లేక మరేదైనా అనేది క్లారిటీ రావడం లేదు. తాజాగా సూసైడ్ నోట్ రాసి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

హైదరాబాద్ – చైతన్యపురి పోలీస్ స్టేషన్  పరిధిలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చేదురుబావి తండాకు చెందిన వేణుశ్రీ అనే యువతి శ్రీచైతన్య కాలేజీలో సెకండియర్ చదువుతోంది. అయితే ఆ యువతి తన హాస్టల్ గదిలో సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. స్నేహితులు గమనించి ఆసుపత్రికి తరలించారు. కళాశాల యాజమాన్యం వేధింపులతోనే తమ కుమార్తె ఆత్మహత్యకు యత్నించిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version