నల్గొండ జిల్లాలో ఓ గర్భిణీ ప్రసవం కోసం నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే పురుడు పోయాల్సిన నర్సులు ఆ ప్రసూతి మహిళను నరకయాతనకు గురి చేశారు. గవర్నమెంట్ ఆసుపత్రి సిబ్బంది ప్రవర్తించిన తీరు అందరినీ మిస్మయానికి గురిచేస్తుంది. ప్రసవం కోసం బిడ్డను మోస్తూ ఆసుపత్రిలో చేరింది అఖిల అనే గర్భిణి. పురిటి నొప్పులు భరించలేక గట్టిగా అరుస్తున్న అఖిలను సైలెంట్ గా ఉండూ అంటూ గదమాయించారు.
ఆ మహిళ గట్టిగా అరుస్తు ఉండడంతో ” పడుకున్నప్పుడు తెలీదా.. ఇప్పుడు మొత్తుకుంటున్నావ్.. సైలెంట్ గా ఉండు” అంటూ నీచంగా మాట్లాడారు. చివరకు ప్రసవం చేయడానికి కూడా నిండు గర్భిణిగా ఉన్న అఖిల పొట్టపై కాళ్లతో నొక్కుతూ కాన్పు చేశారు నర్సులు. దీంతో బిడ్డను ప్రసవించిన వెంటనే అఖిల ప్రాణాలు విడిచింది. నర్సుల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని అఖిల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలతో ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం పోతుందని, అసలు తెలంగాణలో హెల్త్ మినిస్టర్ ఉన్నారా? అని ప్రశ్నించారు. వైద్యశాఖ విఫలమైందని, సిబ్బందిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే డ్యూటీ వైద్యురాలు నర్సలకు డెలివరీ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.