BREAKING: తెలంగాణ ప్రభుత్వ అధికార చిహ్నం ఇదేనా ?

-

తెలంగాణ నూతన రాజముద్ర ఇదేనా…? సోషల్ మీడియాలో ఇదే కొత్త ముద్రా అంటూ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో రేవంత్ రెడ్డి సర్కార్ అన్నట్లుగానే…. తెలంగాణ ప్రభుత్వ అధికార చిహ్నం మార్చేసిందని అంటున్నారు.

Is this the official symbol of Telangana government

వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు రోజుల్లో విడుదల చేసే కొత్త రాజముద్ర ఇదే అంటూ ఓ ఫోటో వైరల్ అవుతుంది. అందులో భారత జాతీయచిహ్నం (సింహాలు, అశోక చక్రం), అమరవీరుల స్తూపం, వరి కంకులు ఉన్నాయి. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తెలంగాణ ప్రభుత్వం అని రాసి ఉంది. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.

అటు తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ను తొలగించారంటూ బీఆర్ఎస్ అభ్యంతరం తెలుపుతోంది. కేసీఆర్ పేరు వినపడకూడదనే మూర్ఖపు ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేటీఆర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్ అంటే అందరికి గుర్తొచ్చేది చార్మినార్.. ఇక, చార్మినార్ను తొలగించడం అంటే ప్రతి ఒక్క హైదరాబాదీని అవమానించినట్లే.. మూర్ఖపు నిర్ణయాలు ఉపసంహరించుకోండని డిమాండ్‌ చేశారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version