ఇవాళ విధుల్లోకి చేరనున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు

-

ఉద్యోగం రెగ్యులరైజ్ చేయడంతో పాటు పలు ఇతర డిమాండ్లతో గత 16 రోజులు తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేసిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ప్రభుత్వంతో చర్చలు జరిపిన అనంతరం శనివారం రోజున వారు సమ్మె విరమించారు. చాలా వరకు జేపీఎస్​లు శనివారం మధ్యాహ్నం నుంచే విధుల్లోకి హాజరయ్యారు. మరికొందరు హాజరు కాకపోవడం.. తమ డిమాండ్ల గురించి జేపీఎస్​ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్​ గౌడ్​ ఇతర ప్రతినిధులు శనివారం రాత్రి పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావును కలిసి సుదీర్ఘంగా చర్చించారు.

చర్చల్లో భాగంగా తాము యథాతథంగా విధులు నిర్వర్తిస్తామని, తమకు తగిన న్యాయం చేయాలని జేపీఎస్​లు మంత్రిని కోరారు. వారి డిమాండ్లను సానుకూలంగా స్పందించిన మంత్రి ఎర్రబెల్లి.. వెంటనే జేపీఎస్​లు విధుల్లో చేరి గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. వారి సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో చర్చలు ఫలించడంతో వారు నుంచి విధులకు హాజరవుతామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version