కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి నేను స్వయంగా చూసాను : కడియం శ్రీహరి

-

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీని ప్రభుత్బాన్ని 6 అబద్ధాలు, 66 మోసాలు, 100 రోజుల పాలనా అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కానీ దేశంలో ఎక్కడా లేని విదంగా రైతు రుణమాఫీ చేసిన ఘనత సిఎం రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ కి దక్కింది. హరీష్ రావు కు సవాల్ చేస్తున్నా.. రైతులకు రుణమాఫీ చేయలేదని చెప్పగలావా అని ప్రశ్నించారు. సన్నాలు పండించిన పంటలకు 500 బోనస్ ఇస్తుంది. ఒక సంవత్సరం లో 55 వేల ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. కేసీఆర్ కుటుంబంలో అందరికి ఉద్యోగం వచ్చింది. అధికారంలో వచ్చిన తరువాత వేల కోట్ల రూపాయలు వెనుక వేసుకున్నారు.

ధరణి, లిక్కర్, కాళేశ్వరం ప్రాజెక్టు లో దోసుకున్న డబ్బులు ఇంతఅంత కాదు. కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి నేను స్వయంగా చూసాను. ఇక ఇలాంటి వాటిలో నేను ఉండలేను అంటూ కాంగ్రెస్ పార్టీ లో కి వచ్చాను. 2014లో మీ ఆస్తులు ఎంత ,అధికారం పోయిన తర్వాత మీ ఆస్తులు ఎంత. అందుకే కేటీఆర్ అంటాడు.. నేను జైలు కు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని.. అంటే తప్పు చేస్తేనే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నావు అని కడియం శ్రీహరి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version