లిక్కర్ స్కాం కేసు లో ఎమ్మెల్సీ కవిత అరెస్టయిన విషయం తెలిసిందే. ఇటీవలే డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరారు. ముఖ్యంగా కవిత కేసులో పదేపదే వాయిదాలు కోరడంతో కవిత లాయర్లపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించారు.
కవిత హెల్త్ చాలా సిక్ అయ్యింది అని తెలిపారు. కవిత ఇప్పటి వరకు పదకొండు కేజీ ల బరువు తగ్గింది. కవిత బెయిల్ ప్రాసెస్ జరుగుతుంది. కవిత కి నెక్ట్ వీక్ బెయిల్ వస్తుంది అని తెలిపారు కేటీఆర్. కవిత కు బీజేపీ ఎందుకు బెయిల్ ఇప్పిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రవి ప్రకాష్ కి లీగల్ నోటీసు పంపిస్తామని.. బేస్ లెస్ వార్తలు వేస్తున్నారు. యూ ట్యూబ్ లో కూడా రాకుండా సస్పెండ్ చేయిస్తాం అన్నారు.