నేటి నుంచి “కేసీఆర్ మహిళాబందు”.. మూడు రోజులపాటు సంబురాలు

-

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్రంలో ” కేసీఆర్‌ మ‌హిళా బంధు” అనే పేరుతో మూడు రోజుల పాటు సంబరాలు నిర్వ‌హించాల‌ని టీఆర్ఎస్ పార్టీ నిర్ణ‌యించిన సంగతి తెలిసిందే.ఈ నెల 8 వ తేదిన అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం వ‌స్తున్న నేప‌థ్యంలో ఇవాళ్టి నుంచే.. కేసీఆర్‌ మ‌హిళా బంధు అనే పేరుతో వేడుక‌లు నిర్వ‌హించనున్నారు.

ఆదివారం నుండి మంగళవారం వరకు నిర్వహించనున్న కార్యక్రమాల కోసం ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రణాళికలు రూపొందించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో ఏడున్నర సంవత్సరాలుగా మహిళా అభ్యున్నతి లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. మహిళల కోసం నియోజకవర్గాల వారీగా టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల ద్వారా ఎంతో మంది లబ్ధిదారులు లెక్కలు తీసి.. వాటి ఆధారంగా మూడు రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.

మూడు రోజుల సంబరాలు ఇలా..
ఆదివారం సంబరాలు ప్రారంభం. మొదటి రోజు సీఎం కేసీఆర్ ఫోటో కు రాఖీలు కట్టడం, పారిశుద్ధ కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థులు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎం, స్వయం సహాయక సంఘాల నాయకులు తదితర మహిళలకు గౌరవపూర్వక సన్మాన కార్యక్రమాలు. అనంతరం కెసిఆర్ కిట్, కల్యాణలక్ష్మి థాంక్యూ, కేసీఆర్ ఆకారం వచ్చేలా మానవహారాలు ఏర్పాటు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version