హైదరాబాద్ ORR ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడం వెనుక ఓ పెద్ద స్కామ్ – కిషన్ రెడ్డి

-

హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు ను అతితక్కువ ధరకు ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడం వెనుక ఓ పెద్ద స్కామ్ ఉందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

“ఓఆర్ఆర్ ఓ బంగారు బాతు లాంటిది. అలాంటి బంగారు బాతును కేసీఆర్ కుటుంబం చంపేస్తోంది. ఈ టెండర్ ప్రక్రియపై ఆడిట్ చేయిస్తారా..? లేక సీబీఐ దర్యాప్తునకు సిద్ధమా..? ఇందులో అక్రమాలు జరగలేదని అంటే.. మీరు నీతి వంతులైదే..? మీరు సీబీఐ విచారణకు కల్వకుంట్ల కుటుంబం సిద్ధంగా ఉందని ప్రశ్నిస్తున్నా. పట్టపగలు.. హైదరాబాద్ చుట్టూ వేలాది కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తాం. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. బాధ్యులు ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాం. ఈ కుంభకోణంలో ఎవరెవరికి ఎంత వాటా ఉందో తేలాల్సిన అవసరం ఉంది.” అని కిషన్ రెడ్డి తెలిపారు.

“ఓఆర్ఆర్ బిడ్ లో తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసుకున్న IRB ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డవలపర్స్ లిమిటెడ్ కంపెనీకి రింగ్ రోడ్డు బాధ్యతలు అప్పగించారు. 7,380 కోట్ల రూపాయలు చెల్లించి.. 30 ఏళ్ల పాటు ఓటర్ రింగ్ రోడ్డును నిర్వహణ చేస్తూ.. ఆ కంపెనీకి కట్టబెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అక్కడ .. ఓఆర్ఆర్ కు సంబంధించి టోల్ వసూలు చేసే ఈగల్ ఇన్ ఫ్రా అనే కంపెని ఏడాదికి 415 కోట్ల రూపాయలు హెచ్ఎండీఏకు చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ద్వారా ఏడాదికి 415 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఓఆర్ఆర్ టోల్ ద్వారా అందుతోంది. ఈ ఈగల్ ఇన్ ఫ్రా కంపెనీ చెల్లిస్తున్న బేస్ ఫ్రైజ్ తీసుకున్నప్పుడు.. ఏడాదికి 5 శాతం పెంచి చూసుకుంటే.. 30 ఏళ్లకు హెచ్ఎండీఏకు 30 వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. ఇంకా చాలా మంది నిపుణులు చెప్పే దాన్ని బట్టి 10 శాతం ఆదాయం పెరిగితే 30 ఏళ్లలో హెచ్ఎండీఏకు 75 వేల కోట్ల రూపాయలు టోల్ ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కొంతమంది అయితే ఒకవేళ హైదరాబాద్ అభివృద్ధిని లెక్కలోకి తీసుకుని.. 15 శాతం అభివృద్ధి లెక్కిస్తే.. వచ్చే 30 ఏళ్లలలో 2 లక్షల 7 వేల 887 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయంగా వస్తుంది. అయినా ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాగూ ఉండేది లేదని.. ఉన్నప్పుడే వెనకేసుకుందామని ఆలోచనలో ఇలాంటి ఒప్పందం చేసుకున్నట్టు కనిపిస్తోంది.

 

అందుకే కేవలం 7 వేల 380 కోట్ల మాత్రమే ముందస్తు చెల్లింపుల ద్వారా అవుట్ రింగ్ రోడ్డు కాంట్రాక్టు సంస్థ.. ప్రభుత్వ అకౌంట్ లో జమా చేయాలని నిర్ణయించారు. 7 వేల 380 కోట్ల రూపాయలు ఎప్పుడు ఇస్తారో స్పష్టత లేదు. ప్రతీ ఏటా ఓఆర్ఆర్ పై ఆదాయం పెరగడం తప్ప తగ్గడం ఉండదు. ఎక్కడకు వెళ్లాలన్నా.. అవుటర్ రింగ్ రోడ్డునే ఉపయోగిస్తున్నారు. మరి వస్తున్న ఆదాయానికి ఎందుకు తక్కువ చేసి.. కాంట్రాక్టు కుదుర్చుకున్నారో తెలంగాణ సమాజానికి తెలియజేయాలి.” అని కిషన్ రెడ్డి కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version