దేశ చరిత్రలోనే ఐటీ దాడుల్లో ఇంత అక్రమ సొమ్ము బయటపడటం తొలిసారి : కిషన్ రెడ్డి

-

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంటి, వ్యాపార సముదాయలపైన జరిగిన ఐటీ సోదాల్లో 290 కోట్ల అక్రమ సంపాదనను అధికారాలు స్వాధీనం చేసుకోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ. కిషన్ రెడ్డి స్పందించారు. దేశ చరిత్రలో ఆదాయ పన్ను అధికారుల దాడుల్లో ఒకే చోట ఇంత పెద్ద అక్రమ సంపాదన బయట పడటం తొలిసారి అని అన్నారు. ఈ ఖ్యాతి కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందంటూ ఎద్దేవా చేశారు. డబ్బులు లెక్కించే యంత్రాలే వేడెక్కి మొరాయిస్తున్నాయి తప్పితే లెక్కించడం పూర్తికావడం లేదని అంత పెద్ద మొత్తంలో అక్రమ సంపాదన ఆర్జించారని ఆరోపించారు. రాంచీలోని 8 బ్యాంకుల్లో లాకర్స్ ఉన్నాయని గుర్తించి ఆదాయ పన్ను శాఖ అధికారులు సీజ్ చేశారంటే.. కాంగ్రెస్ పార్టీ అవినీతి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు.

“రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకమైన, సన్నిహితమైన అనుచరుడు ధీరజ్ సాహు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు అన్ని ఏర్పాట్లు చేసింది ఆయనే. కాంగ్రెస్ నాయకులపై ఐటీ దాడులు జరిగితే రాహుల్ కేంద్రాన్ని విమర్శిస్తారు. ధీరజ్ సాహు అక్రమ సంపాదనపై ఆయన ఎందుకు మాట్లాడటం లేదు. ఆ డబ్బు ఎవరిదో చెప్పాలి. పార్లమెంట్ ఎన్నికల కోసం కూడబెడుతున్న నోట్ల గుట్టలా?”  అని కిషన్ రెడ్డి నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version