తెలంగాణలో మత పరమైన రిజర్వేషన్లు తీసేయాలి – కిషన్‌ రెడ్డి

-

తెలంగాణలో మత పరమైన రిజర్వేషన్లు తీసేయాలని కిషన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గోల్కొండ కోట లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ లో ఉన్న మత పరమైన రిజర్వేషన్లు తీసేయాలని.. అప్పుడే గిరిజనులకు పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు అందుతాయని వెల్లడించారు.

తెలంగాణ లో పదవులు ద్రోహులకు ఇస్తున్నారని.. దళిత సీఎం, మూడెకరాల భూమి ఎక్కడ పోయిందని నిలదీశారు. ఫ్లై ఓవర్ లతో సమస్యలు పరిష్కారం కావని.. ప్రజలకు అనుమతి లేని సెక్రటేరియట్ ఎందుకు అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం కేంద్రం చాలా నిధులు ఇచ్చింది.. తెలంగాణ సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు కిషన్‌ రెడ్డి. ఉద్యమాలు చేసిన అందరికీ కేంద్ర ప్రభుత్వం తరుపున శుభాకాంక్షలు అని.. నీళ్లు , నిధులు , నియామకాలు కోసం ఉద్యమం జరిగిందని వెల్లడించారు.
ఆదిలాబాద్ నుంచి పాలమూరు వరకు అన్ని ప్రాంతాలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశారన్నారు కిషన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version