దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ పీకింది ఏంది – కోమటిరెడ్డి

-

దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ పీకింది ఏందంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. అక్కడ మాకు థర్డ్ ప్లేస్ వచ్చింది. కొత్త ప్రభాకర్ రెడ్డిని కత్తితో పొడవాల్సిన అవసరం మాకు ఏముందన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. తెలంగాణ కోసం 1160 మంది పిల్లలను కోల్పోయామని…తెలంగాణ రాష్ట్రం వచ్చాక 9 కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయి ఆలోచించండని కోరారు.

తెలంగాణ లో కేసీఆర్ ప్రభుత్వం రూ.4లక్షల85 వేల కోట్ల అప్పులు చేయ్యడం తప్పా చేసిందేమిలేదని ఫైర్‌ అయ్యారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నాసిరకంగా నిర్మించారు…సిద్దిపేట లో జరిగినంత అభివృద్ధి జడ్చర్ల లో ఎందుకు జరగలేదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఉద్దండపూర్ నిర్వాసితులకు న్యాయం చేస్తామని కేసీఆర్ చెప్పారు.. ఈ ఐదేళ్లు ఇవ్వకుండా ఎందుకున్నారో ఆలోచించండన్నారు. జడ్చర్ల కాంగ్రెస్ అభ్యర్థి అనిరుద్ద్ రెడ్డి ని గెలిపించండని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version