Flash : బీజేపీకి కొండా విశ్వేశ్వ‌ర రెడ్డి గుడ్ బై ?

-

బీజేపీకి కొండా విశ్వేశ్వ‌ర రెడ్డి గుడ్ బై చెప్పనున్నాడా? అంటే అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు, బీజేపీ కార్యకర్తలు. అంతేకాదు… నిన్న కొండా విశ్వేశ్వ‌ర రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ప్రచారానికి అద్దం పట్టాయి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ డీలా పడిపోయిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కొండా విశ్వేశ్వ‌ర రెడ్డి.

తెలంగాణ బిజెపిలో పలు మార్పులు కావాలని కోరుకుంటున్నామన్నారు మాజీ ఎంపీ, బిజెపి నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ సంకట స్థితిలో ఉందన్నారు. ప్రజలకు నమ్మకం కలిగించేలా బిజెపి మరింతగా శ్రమించాల్సి ఉందన్నారు. ఈసారి కేసీఆర్ ను ఎదుర్కొనే రాజకీయ పార్టీకే ప్రజల మద్దతు దక్కుతుందన్నారు. తెలంగాణ బీజేపీ వ్యవహార శైలిలో అనేక రకాలుగా మార్పులు జరగవలసి ఉందన్నారు. అయితే.. కొండా విశ్వేశ్వ‌ర రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో.. బీజేపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని.. అందుకే ఇలా మాట్లాడుతున్నారని బీజేపీ కార్యకర్తలు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version