ఈ సారి 110 స్థానాల్లో BJP డిపాజిట్ కోల్పోతుందని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. బీసీ ప్రెసిడెంట్ ను తొలగించి.. బీసీ సీఎం అంటుంది బీజేపీ.. బీసీల మీద ఓటమి నెపం నెట్టడానికి సీఎం అభ్యర్థిని తెరపైకి తెచ్చినట్టు కనిపిస్తుందని సెటైర్లు పేల్చారు. బీజేపీ ఈ సారి 110 స్థానాల్లో డిపాజిట్ కోల్పోతుంది.. ఒక వ్యక్తి సీఎం, పీఎం అయితే ఆ సామాజికవర్గానికి లాభం జరుగుతుంది అనుకోవడం ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదన్నారు.
తెలంగాణ ప్రజల మీద మాకు అచంచల విశ్వాసం ఉందని వివరించారు. మా బతుకు ప్రజల చేతుల్లో ఉంది.. మా తల రాత ప్రజలు రాస్తారని తెలిపారు మంత్రి కేటీఆర్. కర్ణాటక కరెంటు కావాలా.. ? తెలంగాణ కరెంటు కావాలా ? అంటూ తెలంగాణ ప్రజలను ప్రశ్నించారు మంత్రి KTR. TUWJ మీట్ ది ప్రెస్ లో కేటీఆర్ మాట్లాడుతూ…కర్ణాటక కరెంటు కావాలా..తెలంగాణ కరెంటు కావాలా చలో ధేక్ లేంగే…కర్ణాటక పోదాం అక్కడి రైతులను అడుగుదాం కరెంట్ ఎలా వస్తుందో అడుగుదామని సవాల్ చేశారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు సమతూకం కోల్పోతాయన్నారు. అప్పట్లో ఒక ప్రభుత్వం ప్రో అర్బన్, ప్రో IT రంగంపై ఫోకస్ పెట్టింది.. ఆ తర్వాత వచ్చిన సర్కార్ వ్యవసాయ రంగం పై దృష్టి పెట్టిందని వెల్లడించారు మంత్రి కేటీఆర్.