డబ్బులిస్తే తీసుకోండి ఓటు మాత్రం బీఆర్ఎస్ కు వేయండి : మంత్రి కేటీఆర్‌

-

కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. స్కాములకు పాల్పడిన హస్తం నేతల వద్ద బాగానే డబ్బు ఉంటుందని.. వాటితో వాళ్లు ఓట్లు కొనుగోలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ నేతలు ఓటుకు నోటు పంచడానికి వచ్చినప్పుడు వాళ్లు పంచిన డబ్బు తీసుకోండని.. కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్ పార్టీకే వేయండని కోరారు.

భద్రాద్రి జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు చిన్న సత్యనారాయణ బీఆర్ఎస్ లో చేరగా.. ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీపై ఫైర్ అయ్యారు.

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని ఓట్లను డబ్బుతో కొనొచ్చని కాంగ్రెస్‌ నేతలు అనుకుంటున్నారని.. వాళ్లు డబ్బిస్తే తీసుకోండని.. ఓటు మాత్రం పేదల పక్షపాతి కేసీఆర్‌కే వెయ్యండి అని కేటీఆర్ అన్నారు. దశాబ్దాల పాటు హింసించిన వాళ్లు.. కొత్త కొత్త వేషాలు వేసుకొని వస్తున్నారని వాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. A నుంచి Z వరకు స్కామ్‌లు చేసి కాంగ్రెస్‌ నేతలు బాగా డబ్బు సంపాదించారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version