ఎంపీ బండి సంజయ్ ప్తె మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. న్యాయవాది తో బండి సంజయ్ కి కేటీఆర్ నోటీసులు పంపారు. ఈనెల 11న ట్విట్టర్లో కేటిఆర్ పై బండి సంజయ్ నిరాధార ఆరోపణలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. ఆరోపణలపై ఆధారాలుంటే బయటపెట్టాలని, లేకుంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 48 గంటల్లో కేటీఆర్ కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని న్యాయవాది అన్నారు. అయితే మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా..
బండి సంజయ్ చేసిన ఆరోపణలపై కేటీఆర్ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, కేటీఆర్ బినామీ కంపెనీ తప్పిదాల వల్లే.. 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని బండి సంజయ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై ఘాటుగా స్పందించిన కేటీఆర్ .. హాస్యాస్పదమైన, నిరాధారమైన, బాధ్యతారహితమైన ఆరోపణలను మీరు ఆపకపోతే.. చట్ట పరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, ఒకవేళ మీ దగ్గర సాక్ష్యం ఉంటే చూపించాలని లేదా బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.