నన్ను 3, 4 నెలలు జైలులో పెట్టాలని చూస్తున్నారు అంటూ బాంబు పేల్చారు KTR. నన్ను ఎదో కేసులో జైలుకు పంపి.. ఆ కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసు పెట్టి ఏదో ఒక విధంగా 3, 4 నెలలు జైలులో పెట్టి మూసీ టెండర్లు అయిపోగొట్టి డబ్బులు దండుకోవాలని చూస్తున్నారు అని ఫైర్ అయ్యారు కేటీఆర్.
గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి లాంటి వాడి దగ్గర అస్సలు తగ్గను అని వెల్లడించారు. మోడీ లాంటి వాళ్ళు భయపడితే భయపడను అని చెప్పారు. బతికినన్ని రోజులు ఇలాగే బతుకుతా అని చెప్పారు.. నాకు అహంకారం ఎక్కువ అని ప్రత్యర్థులు మాట్లాడుతారని వివరించారు. నేను ఏ తప్పూ చేయలేదు కాబట్టి ఆత్మస్థైర్యం, ఆత్మ విశ్వాసం, ఆత్మ గౌరవంతో బతికే వాడిని కానీ మోకరిల్లను.. తగ్గను అన్నారు. అసెంబ్లీలో మేము మాట్లాడుతుంటే మొత్తం స్పీకర్ మొహమే చూపిస్తున్నారు అంటూ కేటీఆర్ ఆగ్రహించారు.