తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రపంచ స్థాయి కంపెనీలను తెలంగాణకు తీసుకురావడంలో విజయం సాధించిన మంత్రి కేటీఆర్, తాను గతంలో చదువుఉతున్న న్యూయార్క్ నగరంలో తన విద్యార్థి, ఉద్యోగ జీవిత కాలానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
తన బిజీ షెడ్యూల్ మధ్యలో, ఫైజర్ సీఈఓతో సమావేశం ముగిసిన అనంతరం న్యూయార్క్ వీధుల్లో నడుచుకుంటూ తర్వాత మీటింగ్ కు వెళ్లారు. తాను విద్యార్థిగా ఉన్న ప్పుడు లెక్సింగ్టన్, 34 అవెన్యూలో గతంలో తాను తిన్న స్ట్రీట్ ఫుడ్ వద్దకు వెళ్లి తనకు అత్యంత ఇష్టమైన వేడి వేడి సాస్ తో కూడిన చికెన్ రైస్ ను కొని తిన్నాడు.
ఆ తర్వాత సమావేశానికి ఆలస్యం అవుతుండటంతో న్యూయార్క్ లో ఉండే ఎల్లో క్యాబ్ ఎక్కి వెళ్లి పోయారు. ఉదయం నుంచి మంత్రితో ఉన్న తెలుగు ఎన్నారైలు, కేటీఆర్ ఒక సాధారణ వ్యక్తిలా వరుసలో నిలబడి తన ఆహారం కొనుక్కోవడం తమకు నచ్చిందని చెబుతున్నారు.
Amidst all the hustle and bustle of New York City, relived some fond memories from past
Was walking down from meetings at Pfizer in midtown when I saw the street food joint on Lexington & 34th. Had to stop and relish some rice n chicken with hot sauce 😀Highly recommend pic.twitter.com/yXknpAmCBy
— KTR (@KTRTRS) March 26, 2022