ITIR అంటే ఏంటో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తెలుసా ? అని కాంగ్రెస్ నాయకుల పరువు తీశారు కేటీఆర్. గవర్నర్ ప్రసంగం అంత అసత్యాలు, తప్పులే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అసెంబ్లీలో విమర్శించారు. “గవర్నర్ ప్రసంగం విని సభ్యుడిగా సిగ్గుపడుతున్నా. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగు, తాగునీటికి దిక్కులేదు. విద్యుత్ లేక పంటలు ఎండిపోయాయి.
ఎక్కడ చూసినా ఆత్మహత్యలు, ఆకలి కేకలు ఉండేవి” అని మండిపడ్డారు. పదేళ్ల పాలనపై మాట్లాడమంటే మళ్ళీ గతం గురించి ప్రస్తావించడమేంటని మంత్రి పొన్నం…. కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. ప్రజా వాణి కొత్తగా ప్రారంభించేది ఎంటి ? ప్రతి సోమ వారం జిల్లాలో నడుస్తుందని చురకలు అంటించారు.
కంచెలు తీసినం అని బిల్డప్ ను నమ్మరు…కంచెలు వేసింది …కాంగ్రెస్ హయంలోనేనని గుర్తు చేశారు. భట్టి నియోజక వర్గంలో హామీల అఫిడవిట్ ఇచ్చారు…అమలు చేయాలని కోరుతున్నామని చెప్పారు. ఇప్పటికీ మూడు క్యాబినెట్ మీటింగ్ లు అయ్యాయి…హామీల అమలు ఊసు లేదన్నారు.BRS హయాంలో ITIR లేకున్న సాధించామని…అసలు ITIR అంటే ఏంటో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తెలుసా ? అని ప్రశ్నించారు.