మా బావ హరీశ్ రావును అప్పుడప్పుడు ఏడిపిస్తుంటా: కేటీఆర్‌

-

సిద్దిపేట ఐటీ టవర్‌ ప్రారంభోత్సవంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇది కాస్త కెమెరా కంటికి చిక్కింది. ఇంకేం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వేదికపై కేటీఆర్, హరీశ్ రావులు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. అభివృద్ధి కాముకుడు హరీశ్‌ అని కేటీఆర్‌ అనగా.. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ గౌరవాన్ని కేటీఆర్‌ చాటుతున్నారంటూ హరీశ్‌ కొనియాడారు.

‘‘నేను సిరిసిల్లకు సిద్దిపేట మీద నుంచే పోవాలి. సిద్దిపేట రాగానే హరీశ్‌రావుకు ఫోన్‌ చేస్తా. ఏం సంగతి బావా! మళ్లేదో కొత్తవి కట్టినవ్‌.. కొత్త రోడ్లు వేసినవ్‌.. అని అడుగుతా. అందుకు ఆయన స్పందిస్తూ… ఇక లాభం లేదు. మళ్లోసారి వచ్చినప్పుడు కళ్లుమూసుకొనిపో. ప్రతిసారీ ఏదో ఒకటి అంటున్నవ్‌ అంటూ సరదాగా బదులిస్తారు’’ అంటూ చమత్కరించారు. హరీశ్‌రావు తన బావ కాబట్టి అప్పుడప్పుడూ అలా ఏడిపిస్తుంటానని చెప్పారు.

వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ, అనర్గళంగా మాట్లాడుతూ.. అందరిని ఒప్పిస్తూ, మెప్పిస్తూమంత్రి కేటీఆర్ రాష్ట్రానికి పరిశ్రమలను రప్పిస్తున్నారని హరీశ్ రావు అన్నారు. తమకూ కేటీఆర్‌ లాంటి నాయకుడు ఐటీ, పరిశ్రమల శాఖగా మంత్రిగా ఉంటే బాగుంటుందని ఇతర రాష్ట్రాల ప్రముఖులు, సామాన్యులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతుండడం చూశానని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version