మాలోనూ కొన్ని లోపాలు, బలహీనతలు ఉన్నాయి.. కానీ : మంత్రి కేటీఆర్

-

తమలోనూ కొన్నిలోపాలు, బలహీనతలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. కానీ ఆ లోపాలు సరిదిద్దుకుంటూ.. బలహీనతలను బలంగా మార్చుకుంటూ తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్​గా తీర్చిదిద్దామని తెలిపారు. యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసమే చూస్తున్నారనేది సరికాదని.. తమ నైపుణ్యాలు ప్రదర్శించి ప్రైవేటు రంగంవైపు యువత వెళ్తున్నారని తెలిపారు. తమ కంటే ఎక్కువ నియామకాలు చేపడుతున్న ప్రభుత్వం లేదని చెప్పారు. గ్రూప్‌-1, 2, 4 పరీక్షలను 12.5 లక్షల మంది రాశారని.. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారనేది వాస్తవం కాదని స్పష్టం చేశారు. ప్రైవేటు రంగంలో పనిచేస్తూనే ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తున్నారని అన్నారు.

“తెలంగాణలో రవాణా చాలా మెరుగుపడింది. కొత్తగా వెయ్యి ఎలక్ట్రిక్‌ బస్సులు తీసుకువస్తున్నాం. మెట్రో పూర్తి చేసి ఐదున్నర లక్షల మంది ప్రయాణిస్తున్నారు. మైనార్టీల సంక్షేమానికి అధిక కేటాయింపులు చేశాం. మైనార్టీల కోసం ఏటా వెయ్యి కోట్లు వెచ్చిస్తున్నాం. భవిష్యత్‌ తరాన్ని పటిష్టం చేయాలనేది మా తపత్రయం. రైతుబంధు పెట్టాలని కాంగ్రెస్‌కు ఆలోచన కూడా రాదు. రైతుబంధును మా నుంచి నకలు చేసి మేనిఫెస్టోలో పెట్టారు. కేంద్రానికి రూపాయి కడితే 46 పైసలు చెల్లిస్తున్నారు. మిగతా నిధులు వివిధ రాష్ట్రాల్లో రోడ్లకు వెచ్చిస్తున్నారు. ఎవరిపై ఎవరు ఆధారపడ్డారనేందుకు ఇదే నిదర్శనం.” అని కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version