కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీ అంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టే : కేటీఆర్

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ కామారెడ్డిలో నిర్వహించిన సమావేశానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి అభివృద్ధి కోసమే కేసీఆర్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఉద్యమకారులపై తుపాకి గురిపెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు కేటీఆర్. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధి కోసమే కేసీఆర్ షి చేస్తున్నారు. ఎంతో మంది తమ్ముల్లు, చెల్లెమ్మలు తమ ప్రాణాలను బలి పెట్టారు. గంప గోవర్థన్ రెడ్డి ఆహ్వానం మేరకు కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు.


కేసీఆర్ పోటీచేస్తున్నారంటే షబ్బీర్ అలీ పక్కకు పారిపోతున్నారు. గుజరాత్ నుంచి వచ్చే డబ్బులు అన్నీ మనవే.. అవి తీసుకొని గులాబీ జెండా కారు గుర్తుకు ఓటు వేయండి. కామారెడ్డిలో కేసీఆర్ సభతోనే ప్రతిపక్ష నేతలు నామినేషన్లను రద్దు చేసుకోవాలి. కామారెడ్డి ఉద్యమ గడ్డ అన్నారు. కామారెడ్డికి కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు కేసీఆర్ అని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ రాకతో కామారెడ్డి దశ మారిపోతుందని తెలిపారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version