పాస్‌పోర్ట్ పొగొట్టుకొని జైలులో.. విదేశాంగ మంత్రికి కేటీఆర్ లేఖ

-

సాధారణంగా ఈ మధ్య కాలంలో చాలా మంది విదేశాలకు వెళ్లి ఏదో ఒక చిక్కుల్లో చిక్కుకుంటున్నారు. నిత్యం ఇలాంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. విదేశాల్లో చిక్కుకున్నాం.. మమ్ముల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారంటూ రోజు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎవరో ఒకరూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేయడం.. ప్రభుత్వం వారికి అండగా నిలవడం జరుగుతుంది.

తాజాగా సిరిసిల్లకు చెందిన నర్సయ్య కోసం విదేశాంగ మంత్రికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. పాస్‌పోర్ట్ పొగొట్టుకొని బహ్రెయిన్ జైల్లో చిక్కుకుపోయాడు నర్సయ్య. నర్సయ్యను భారతదేశానికి రప్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నాడు కేటీఆర్. విదేశాంగ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి కూడా ఈ మేరకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. బహ్రెయిన్‌లోని పార్టీ ఎన్ఆర్ఐ విభాగం, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం సమన్వయం చేసుకొని నర్సయ్య విడుదలకు సహకరించాలని సూచన చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version