ఇనుప కంచె తీయడం కాదు..స్వేచ్చ ఇవ్వాలి అంటూ రేవంత్ రెడ్డి సర్కార్ కు చురకలు అంటించారు MLA, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు. మార్చి 2026 నాటికి నక్సల్స్ నీ తుడిచిపెట్టేస్తం అన్నారు…ఇప్పటికే అనేకమంది నక్సల్స్ నీ ఎన్కౌంటర్ చేశారని ఆగ్రహించారు. ఈ మధ్య కాలంలో దాదాపుగా 500 మంది నక్సల్స్ ను మట్టుబెట్టారని మండిపడ్డారు. పోలీసులు వారంతట వారు చేస్తున్నారా? కేంద్రం ఆదేశించిందా?? రాష్ట్ర సిఎం ఆదేశించరా? అని నిలదీశారు.
BRS వాళ్ళు ప్రశ్నించడం తప్పు కాదు… కానీ ప్రతిదాన్నీ కాంట్రవర్సీ చేస్తున్నారు… ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నించండి…అంటూ కోరారు. రాజశేఖర్ రెడ్డి లాగా… ప్రజలతో ఒక గంట సమయం ఇవ్వాలి… ప్రతి ఒక్క మంత్రి.. ఎమ్మెల్యే, సిఎం రేవంత్ అందరూ ఉండాలన్నారు.. సీపీఐకి కార్పొరేషన్ లు ఇస్తామన్నారు..ఇవ్వలేదు… MlC అన్నారు… ఇవ్వలేదు… ఇప్పుడు ఇస్తారని అనుకుంటున్నామని వివరించారు. కొత్తగూడెం లో కాంగ్రెస్ వల్ల, టీడీపీ, జనసమితి, అన్ని పార్టీల వల్ల మేము గెలిచామని.. ఒప్పుకుంటామన్నారు. కానీ మిగితా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా వల్ల వాళ్ళు గెలిచారు అనే విషయాన్ని కొందరు మరిచిపోతున్నారని హెచ్చరించారు.