చరిత్రలో కాంగ్రెస్ కు 60 సీట్లు దాటిన దాఖలాలు లేవని తేల్చి చెప్పారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. గత మూడు రోజులుగా బీజేపీ జాతీయ నాయకత్వం మోదీ, అమిత్ షా, నడ్డా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో పాల్గొన్నారు…ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోందన్నారు. మోదీపై ప్రజలకు అపారమైన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు…బీజేపీ మేనిఫెస్తోను ఒక పవిత్రగ్రంధంగా ప్రజలు భావిస్తున్నారని వివరించారు.
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాన్ని ప్రజలు కోరుకుంటున్నారని..ప్రధాని రోడ్ షోకు, సభలకు విశేష ఆదరణ లభించింది.. ప్రజలు సవచ్చండంగా తరలివచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రజలు నమ్మడం లేదు.. సీఎం కేసీఆర్ అబద్ధపు మాటలు, వాగ్ధానాలు విని విని ప్రజలు విసిగి వేసారిపోయారని చురకలు అంటించారు. బీజేపీ మేనిఫెస్టో ప్రజల మనోగతాన్ని ప్రభావితం చేసే సంకల్ప పత్రం అన్నారు. వేలం పాట మాదిరిగా పోటీ పడి పథకాలను ప్రకటిస్తున్నారన్నారు. కారు షెడ్డుకు పోతుంది.. కమలం వికసిస్తుంది….చరిత్రలో కాంగ్రెస్ కు 60 సీట్లు దాటిన దాఖలాలు లేవని తేల్చి చెప్పారు.