తెలంగాణలో RRR ట్యాక్స్ నడుస్తోంది – మహేశ్వర్ రెడ్డి సంచలనం

-

తెలంగాణలో RRR ట్యాక్స్ నడుస్తోందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి రీసర్చ్ చేసి మరీ దోపిడీ చేస్తున్నారు…అబద్దాల పునాదుల మీద, తెలంగాణ రాష్ర్ట ప్రజలని మోసం చేసి గద్దేనెక్కిండని ఆగ్రహించారు. కడుపు కట్టుకుంటే 40 వేల కోట్లు బ్యాంక్ లకు కట్టొచ్చు అంటున్నావు.. ఎలా వస్తాయని నిలదీశారు. ఇప్పుడు RRR టాక్స్ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా అంటూ ఆరోపణలు చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో పర్మిషన్ లు ఆపి… ఇప్పుడు పర్మిషన్ లు ఇవ్వడానికి కారణమన్నారు.

2022…23 లో మూడు వేల ప్రాజెక్ట్ లకు పర్మిషన్ లు ఇచ్చారు… ప్రతి ఏడాది 120 కోట్ల చదరపు అడుగులు అనుమతులు ఇస్తున్నారు… హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ .. సెటిల్ మెంట్ ఇమేజ్ గా మారిందట అంటూ ఫైర్‌ అయ్యారు. రేవంత్ రెడ్డి చదరపు అడుగుకు వంద రూపాయలు అడుగుతున్నారు అట అంటూ ఆరోపణలు చేశారు. కేటీఆర్ కు ఇచ్చినట్టు ఫ్లాట్స్ ఇస్తామని అంటే డబ్బులే ఇవ్వాలని అంటున్నారు అట….ఎన్నికల్లో విచ్చల విడిగా ఖర్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి దొరికిపోయాడు… మరో రెండు మూడు రోజుల్లో మరో tax బయట పెడతానన్నారు. రిజర్వేషన్ ల పై రేవంత్ రెడ్డీ మూర్ఖత్వం తో మాట్లాడుతున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version