రూ.500 బోనస్ పై మంత్రి జూపల్లి కీలక ప్రకటన

-

రూ.500 బోనస్ పై  మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక ప్రకటన చేశారు. ఈ సీజన్ లోనే  సన్నాలకు బోనస్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. సోమవారం మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చామని అన్నారు. గతంలో పదేళ్ల పాటు ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయిన రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదని గుర్తుచేశారు.

తమ ప్రభుత్వంలో కొనుగోలు చేసిన ధాన్యానికి రైతుల ఖాతాల్లో రెండు రోజుల్లోనే  డబ్బులు వేశామని తెలిపారు. అధికారంలో పదేళ్ల పాటు ఉన్నా. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని తెలిపారు. గతంలో రుణమాఫీపై బీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికలు పూర్తి అయ్యాక.. జులై రెండో వారంలోనే రుణమాఫీ ప్రక్రియ మొదలు పెట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో వేగంగా రుణమాఫీ పక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు. తెలంగాణలో జరిగిన విధంగా దేశంలో ఇంతవరకు ఎక్కడా రుణమాఫీ జరుగలేదని అన్నారు. 2014 తర్వాత బీజేపీ ఎప్పుడూ రుణమాఫీ గురించి మాట్లాడలేదని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version