కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడంలో మంత్రి కేటీఆర్ ఎప్పుడూ ముందే ఉంటారు. సోషల్ మీడియా, సన్నిహితుల ద్వారా కష్టాల్లో ఉన్న వారి గురించి తెలుసుకుని కేటీఆర్ సాయం చేస్తారు. తాజా గా మరో సారి కేటీఆర్ తన సేవా గుణాన్ని చాటారు. కుటుంబ పోషణ కోసం ఆటోను నడుపుతున్న ఇంటర్ విద్యార్థిని సబిత గురించి తెలుసుకు మంత్రి కేటీఆర్.. ఆమెకు సాయం చేశారు. నల్గొండకు చెందిన సబిత చదువును పక్కన పెట్టి కుటుంబం కోసం ఆటో నడిపిస్తుంది.
అది తెలుసుకున్న కేటీఆర్ సబితకు అండగా నిలిచారు. ఈ రోజు విద్యార్ధిని సబితను ప్రగతి భవన్ కి పిలిపించుకొని ఆమెతో మాట్లాడారు. తండ్రిని కోల్పోయిన సబితకు అండగా ఉంటామని ప్రకటించారు. అలాగే సబితకు రెండు పడకల ఇళ్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అలాగే సబిత కోరిక మేరకు ఆటో రిక్ష కూడా ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే భవిష్యత్తులో సబిత కుటుంబానికి తాము అండగా ఉంటామని కేటీఆర్ ప్రకటించారు. అలాగే సబిత పట్టుదల గురించి చెబుతూ ప్రశంసలు కురిపించారు. సబిత నేటి యువ తరానికి స్ఫూర్తి అని అన్నారు.
As promised, met this young & supremely confident girl Sabita. Impressed with her clarity of thoughts & expression👏
Handed over copies of 2BHK proceeding & an Auto rickshaw as she had asked. Also promised to support her education pursuits
Special thanks to @Collector_NLG 👍 pic.twitter.com/qKGUhlN5t3
— KTR (@KTRTRS) February 9, 2022