Minister KTR : డిసెంబర్ 3 తర్వాత గుడ్ న్యూస్.!

-

ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు మాది భరోసా అని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తెల్లారి నాలుగవ తేదీన 10 గంటలకు అశోక్ నగర్లో యువతతో సమావేశం అవుతానని కేటీఆర్ వివరించారు. తాజాగా నిరుద్యోగులకు మంత్రి కేటీఆర్‌ చర్చలు జరిగి..ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేస్తాం.

Minister KTR met un employees

గ్రూప్ 2 ఉద్యోగాల సంఖ్యను మరింతగా పెంచుతామని..ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తామని వివరించారు. నోటిఫికేషన్లు ఫలితాల జారీపైన ఉన్న కేసుల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామని…యువకుల ఆకాంక్షలకు అనుగుణంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేస్తామన్నారు. 10 సంవత్సరాల పాటు ఉద్యోగం నిర్వహించిన యువకుడిగా,సోదరుడిగా యువత ఆకాంక్షలు అర్థం చేసుకోగలుగుతానన్న కేటీఆర్…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల తాలూకు వివరాల జాబితాను, ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఉద్యోగాల ప్రక్రియ తాలూకు వివరాలను గణాంకాలతో సహా అందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version