ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కోల్ కత్తాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన సంఘంగా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక తాజాగా ఈ విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. కోల్ కత్తాలో వైద్యురాలు పై జరిగిన అత్యాచారం, హత్య నన్ను తీవ్రంగా కలచివేసింది అని పేర్కొన్నారు. సభ్యసమాజం తలదించుకునే ఘటన ఇది. ఆ ఫ్యామిలీకి దేశమంతా అండగా ఉంది అని అన్నారు.
అలాగే ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. వారి కుటుంబానికి న్యాయం జరగాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి వారిని కఠినంగా శిక్షించాలి అని కోరారు. దేశ వ్యాప్తంగా డాక్టర్ల నిరసనకు సంఘీభావం తెలుపుతున్న. వారి నిరసనలు సభభే. కానీ నిన్న ప్రైవేట్ హాస్పటల్స్ లో వైద్యులు ఓపీ,అత్యవసర సేవలు బంద్ చేసి నిరసనలు తెలపడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాబట్టి వైద్యులు డ్యూటీ లో ఉండి నిరసనలు తెలపాల్సిందిగా నా యొక్క విజ్ఞప్తి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్.. వైద్యుల పై దాడి చేస్తే తీవ్ర చర్యలు ఉంటాయని గతంలో కాంగ్రెస్ పార్టీ చట్టం చేసింది అని గుర్తు చేసారు.