వైద్యులకు మంత్రి సీతక్క విజ్ఞప్తి..!

-

ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యం అందించండం కోసం బైక్ అంబులెన్సు ఎంతో ఉపయోగపడుతుంది అని మంత్రి సీతక్క అన్నారు. తాజాగా ఆదిలాబాద్ లో మాట్లాడిన ఆమె.. కంటైనర్ స్కూల్ మా ప్రాంతంలో ఏర్పాటు చేశాం. గ్రామీణ ప్రాంతంలో వైద్యులు రాక ఇబ్బంది పడుతున్నాం. పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారిని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడం కోసం పంపించాం. గ్రామీణ ప్రాంత బిడ్డలకు సేవ చేయడం వృత్తికి ఇచ్చే గౌరవం అని అన్నారు.

అలాగే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు క్యాన్సిల్ చేసే దశలో ఉన్న వాటికి మేము జీవం పోసాం. మెడికల్ కాలేజీలను సమర్థవంతంగా నిర్వహించడానికి కృషి చేశాం అని పేర్కొన్నారు. అదే విధంగా మారుమూలా అటవీ ప్రాంతాల్లో ఎంత సేవ చేస్తే అంత మంచి పేరు సంపాదించవచ్చు. కష్టమైనా ఇష్టంగా మలుచుకొని ట్రైబల్ ఏరియాలో పనిచేయండి. ముఖ్యంగా వైద్యులు ముందుకు వచ్చి గిరిజన గ్రామాల్లో సేవ చేయాలని విజ్ఞప్తి చేసారు మంత్రి సీతక్క.

Read more RELATED
Recommended to you

Exit mobile version