కేసీఆర్ కామెంట్స్ పై మంత్రి సీతక్క స్ట్రాంగ్ వార్నింగ్..!

-

తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశ పెట్టి.. అనంతరం ప్రసంగించారు. ఆ తరువాత అసెంబ్లీ వాయిదా వేసారు. అసెంబ్లీ వాయిదా వేయగానే ప్రతిపక్ష నేత కేసీఆర్ తొలిసారి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు చేరుకొని మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని.. ఆరు నెలలు సమయం ఇవ్వాలని తాను రాలేదన్నారు. భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా మంత్రి సీతక్క కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించింది. బడ్జెట్ పై కేసీఆర్ విమర్శలు చేయడం పై స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చింది. కేంద్ర బడ్జెట్ పై స్పందించని కేసీఆర్.. రాష్ట్ర బడ్జెట్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన కేంద్ర బడ్జెట్ ను నిరసిస్తూ.. అసెంబ్లీ తీర్మాణం చేస్తే.. కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు మంత్రి సీతక్క. బీజేపీ మెప్పు కోసమే.. కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ ను విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీకి వచ్చిన మొదటి రోజే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు మంత్రి సీతక్క.

Read more RELATED
Recommended to you

Latest news