రైతు బంధు విషయంలో వాళ్లే నిర్ణయం తీసుకోవాలి : తుమ్మల నాగేశ్వరరావు

-

రైతు బంధు అంటే, పంట వేసే రైతుకు చేయూత. వ్యవసాయం చేసే రైతుకు చేయూత ఇవ్వాలనేదే రైతు బంధు ఉద్దేశం. అయితే రైతు బంధు ఎవరు తీసుకోవాలో, కౌలు రైతులు, ఓనర్లు కలిసే నిర్ణయం తీసుకోవాలి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో పంటల భీమా విషయంలో, వచ్చే నెల నుంచి పంటలకు మేమే ప్రీమియం కట్టి పంటలకు ఇన్సూరెన్స్ చేస్తాం పంటల ఇన్సూరెన్స్ కోసం 3 వేల కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా వేస్తున్నాము.

ఇక ఏపీలో ఉన్నట్లు కౌలు రైతు ఒప్పందాలు తెలంగాణలో లేవు. ఇక్కడి భూ చట్టాలు వేరు, ఏపీలో ఉన్న చట్టాలు వేరు. గత ప్రభుత్వ హయాంలో 20 లక్షల రైతులకే రుణమాఫీ చేశారు. ఇప్పుడు 42 లక్షల మంది రైతులున్నారు. రైతు క్షేమం కోసమే మా ప్రభుత్వం పనిచేస్తుంది. 5 ఏళ్లలో కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదు. ఒకేసారి 18 వేల కోట్ల రూపాయలు ఇచ్చి రుణమాఫీ చేసిన ఘనత మా ప్రభుత్వానిది. ఇంకా అవసరమైన నిధులు సమకూరుస్తాం. పంట నష్టంతో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రీమియం ప్రభుత్వమే కట్టి ఇన్సూరెన్స్ చేయనుంది. ప్రతిపంట, ప్రతిరైతుకు భీమా వర్తించేలా 3000 కోట్లతో ఇన్సూరెన్స్ చేయనున్నట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version