లండన్​కు ఎమ్మెల్సీ కవిత.. మహిళా రిజర్వేషన్‌ చట్టంపై నేడు ప్రసంగం

-

ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత లండన్​లో పర్యటిస్తున్నారు. బ్రిడ్జ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ నిర్వహించే సమావేశంలో కీలకోపన్యాసం చేసేందుకు కవిత లండన్ వెళ్లారు. ఇవాళ ఆమె మహిళా రిజర్వేషన్ల అంశంపై మాట్లాడనున్నారు. లండన్‌లోని సెంట్రల్ హాల్ వెస్ట్ మినిస్టర్‌లో ఇవాళ మహిళా రిజర్వేషన్ చట్టం – ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం అనే అంశంపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఆ సమావేశంలో చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ల కోసం జరిగిన పోరాటం, రిజర్వేషన్ల వల్ల జరిగే మేలు, చట్టసభలు, ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెంచడం, రాజకీయాల్లో మహిళల పాత్ర వంటి అంశాలపై కవిత ప్రసంగించనున్నారు. ఇవాళ ఉదయం లండన్‌లోని అంబేడ్కర్ హౌస్ మ్యూజియంను కూడా ఎమ్మెల్సీ కవిత సందర్శించనున్నారు. శనివారం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ అండ్ అల్యూమిని యూనియన్ యూకే నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొని ప్రసంగిస్తారు. మరోవైపు భారత్​లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version