ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు

-

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. కవితకు ఈడీ అరెస్ట్ నోటీసు అందజేసింది. కవిత ఉపయోగించిన రెండు ఫోన్లను సీజ్ చేయడంతో పాటు మొత్తం 16 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 5 గంటల నుంచి ఎమ్మెల్సీ కవితను ఈడీ, ఐటీ అధికారులు విచారించారు. ఈడీ నుంచి ఐటీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు అన్నారు.

కవితకు అరెస్ట్ వారెంట్ ఇచ్చారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం గేట్ వద్ద ఆందోళన చేపడుతున్నారు. నరేంద్ర మోడీ డౌన్ డౌన్..  అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇది రాజకీయంగా వాడుకోవాలని అరెస్ట్ చేయాలని చూస్తున్నారని పలువురు పేర్కొంటున్నట్టు సమాచారం. సుప్రీంకోర్టులో ఈనెల 19న కవితకు సంబంధించిన కేసు విచారణ జరుగనుంది. అయితే ఈ నాలుగు రోజుల వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోరు.. 19 వరకు అరెస్ట్ చేయరు అని లాయర్లు చెబుతున్నప్పటికీ.. కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version