గాంధీభవన్ లో ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల వారిగా వివరాలు సరిగ్గాలేవని పేర్కొన్నారు. సామాజిక వర్గాల వారిగా వివరాలు లేవన్నారు. ముఖ్యంగా బీసీలకు అవసరం అనుకుంటే నల్లగొండ వదిలేస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ డిక్లరేషన్ అమలు చేస్తాం అని చెప్పారు. ఒకవేళ డిక్లరేషన్ అమలు చేయకుంటే రాజీనామా చేస్తామని పేర్కొన్నారు కోమటిరెడ్డి. జాబితా షార్ట్ లిస్ట్ చేయకూడదని పీఈసీ సమావేశంలో చెప్పినట్టు వెల్లడించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. మాట తప్పితే.. తల నరుక్కుంటా అన్నారు కేసీఆర్.. మరీ ఏం చేశారని ప్రశ్నించారు. మూడు ఎకరాలు ఇస్తానన్నారు ఏమైందన్నారు. సీఎం కేసీఆర్ మాదిరిగా కాకుండా అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ కలుపుకొని పోతుందని స్పష్టం చేశారు కోమటిరెడ్డి. మరోవైపు సెప్టెంబర్ 02న మరోసారి ఎలక్షన్ కమిటీ సమావేశం జరుగనున్నట్టు సమాచారం.