సీఎం కేసీఆర్ కి ఎంపీ కోమటిరెడ్డి లేఖ

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా ఓ లేఖ రాశారు. ఈ లేఖలో పలు కీలక విషయాలను ప్రస్తావించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సగం నెల గడిచినా ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 01వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు జమ చేసేదని.. అదేవిధంగా వారికి పీఆర్సీ, డీఏ కూడా సమయానికి ఇచ్చేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులను రోడ్డున పడేశారని మండిపడ్డారు.

ప్రస్తుతం ఇలా ఉంటే రానురాను నెలనెలా జీతాలు ఇస్తారో లేదోననే అనుమానం అందరిలో నెలకొందన్నారు. విశ్రాంత ఉద్యోగులు మరింత ఎక్కువ ఆందోళన చెందుతున్నారని, ఎక్కువ మంది పింఛన్ల మీదనే ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓఆర్ఆర్ టెండర్ చేపట్టి.. మద్యం దుకాణాలు వేలం వేసి, భూములు అమ్మి బీసీ బంధు, దళిత బంధు అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలకే దోచి పెడుతున్నారు. కానీ ఉద్యోగులకు జీతం మాత్రం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎవరైనా జీతాల గురించి అడిగితే వారిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఇంత జరుగుతున్న సర్కార్ ఏం చేస్తుందోననే భయంతో నోరు ఎత్తడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తామని, వారికి రావాల్సిన బకాయిలు, పీఆర్సీ చెల్లిస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version