సిద్దిపేటలో టీఆర్ఎస్ ఓటమి ఖాయం – మురళీధర్ రావు

సిద్దిపేటలో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని బీజేపీ నేత మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధిపేట అసెంబ్లీలో ప్రజా గోసా.. బిజేపీ భరోసా కార్యక్రమంలో పాల్గొన్నానని.. సిద్దిపేట ప్రజలు కుతకుతగా ఉన్నారన్నారు. ఎన్నికల వాగ్ధానాలు నెరవేరలేదని… సిద్దిపేట చౌరస్తాలో చర్చకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. హరీష్‌ రావు.. సిద్దిపేటను అభివృద్ధి చేసిందేమీ లేదని మండిపడ్డారు మురళీధర్ రావు.

టిఆర్ఎస్ లో అసమ్మతి బాంబ్ త్వరలో బ్లాస్ట్ అవుతుందని.. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడే పరిస్థితి లేదని పేర్కొన్నారు. అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని.. ఉచిత పథకాలపై ఒక్క రాష్ట్రాన్ని ఉద్దేశించి మాట్లాడింది కాదని పేర్కొన్నారు.

కార్పొరేట్ లోన్లు ఎక్కడ తీసివేయలేదు.. టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే.. కేంద్ర ప్రభుత్వం Vs రాష్ట్ర ప్రభుత్వం అని చూపేందుకు తప్పుడు రాజకీయ ప్రచారం చేస్తూ యుద్ధం ప్రారంభిస్తున్నారని ఆగ్రహించారు.