ప్రపంచంలో అత్యంత స్ట్రాంగ్ లీడర్ నరేంద్ర మోడీనే అని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తాజాగా నల్లగొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం కోదాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. కోదాడ నియోజకవర్గంలో 13,706 ఓట్లు ఉన్నాయి.చరిత్ర నిర్మాతలు పార్టీలు, నాయకులు కారు ప్రజలు మాత్రమే.మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కావాలని ప్రజలు భావిస్తున్నారు. నల్లగొండలో బీజేపీకి డిపాజిట్ రాదు అనేది అవగాహన లేనివారు అహంకారంతో మాట్లాడేవి. ఎన్ని డబ్బులు పెట్టినా ధర్మం న్యాయం గెలుస్తుంది.
బీజేపీకి 12 సీట్లు గెలుస్తం అని అమిత్ షా మాట్లాడారు. అదే నిజం కాబోతోంది. మొన్ననే నీకు ఓటు వేసి మోసపోయినం ఈసారి బీజేపీకి ఓటువేస్తాం అని ప్రజలు డిసైడ్ అయ్యారు. నాలుగవ తారీఖు డబ్బాలు ఇప్పాక మీ సంగతి ఎందో తెలుస్తుంది. ఇక్కడ ఉన్న మంత్రిగారు బీజేపీకి డిపాజిట్ రాదు అని చెప్తున్నారట మీ కుర్చీ కిందకు నీళ్ళు వచ్చాక తెలుస్తుంది బీజేపీ ఎంది అనేది. ప్రపంచంలో స్ట్రాంగ్ లీడర్ మోడీ. కాశ్మీర్ సమస్య తీర్చారు. లాల్ చౌక్ లో త్రివర్ణ పతాకాన్ని స్వేచ్చగా ఎగురవేసే పరిస్థితి తీసుకువచ్చారు.రష్యా ఉక్రెయిన్ యుద్దం ఆపి మన విద్యార్థులను తీసుకువచ్చిన ఘనత మోదీ గారిది. ప్రపంచ యుద్దం సమయంలో ఎక్కడ ఇలా జరగలేదు. అందుకే మోడీ గ్రేట్ అన్నారు ఈటల.
అమెరికా సేనేటర్లు జై మోదీ అని నినాదం చేసే స్థాయికి భారత దేశం ఔన్నత్యం పెంచారు. 12 కోట్ల టాయిలెట్స్ కట్టించి మహిళల ఆత్మగౌరవం కాపాడారు. జనదన్ అకౌంట్ ఓపెన్ చేసి.. డిజిటల్ ట్రాన్స్జాంక్షంన్ తీసుకువచ్చారు. అమెరికాలో ఇది పదేళ్లు పడితే భారత్ లో మూడేళ్లే పట్టింది. కాంగ్రెస్ హయాంలో కొల్ స్కాం, బోఫోర్స్ స్కాం, 2 G స్కాంలు జరిగాయి. మంత్రులే జైళ్లకు పోయారు.ఇందిరా గాంధీ గరీబీ హటావో నినాదం ఇచ్చారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ రాహుల్ గాంధీ అదే నినాదం ఇస్తున్నారు అంటే వారు చేసిన అభివృద్ది అర్థం చేసుకోండి. ఈ పదేళ్లలో నేషనల్ హైవేలు డబుల్ చేసిన ఘనత మోడీ గారిది.
76 ఉన్న ఎయిర్ ఫోర్ట్స్ ను 153 చేశారు. మోడీ కంటే ముందు 3 AIMS ఉంటే ఈ పదేళ్లలో 16 ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి కల్పన ఉందా.. మీకు మోడీ గారికి పోలిక ఎక్కడిది. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. 500 ఏళ్ళ కల రామమందిరం నిర్మించి భారత సంస్కృతి సాంప్రదాయాలు కాపాడిన బిడ్డ మోదీ. మోడీ హయాంలో బాంబుల మోతలు లేవు.. తెగిపడ్డ శరీరాలు లేవు. ప్రజల పక్షాన ఉండే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించండి అని విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు.